కోనసీమ: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపేట నియోజకవర్గంకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు అయినవిల్లి సత్తిబాబు గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాలతో ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగలి గోపీశ్రీనివాస్ ఆదివారం లిస్ట్ విడుదల చేశారన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.