KRNL: కౌతాళం మండలంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త పుగ్గి మరిస్వామి తల్లి నిన్న అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప మంగళవారం మృతురాలి భౌతికకాయానికి నివాళులర్పించారు. అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.