VZM: విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా డొక్కాడ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చెందిన రామకృష్ణ గతంలో ఏఎంసీ ఛైర్మన్గా, ఆయన భార్య మంగమ్మ గుమ్మలక్ష్మిపురం జడ్పీటీసీగా పనిచేశారు. గ్రంధాలయ సంస్థ ఛైర్మన్గా నియమితులైన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.