CTR: వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో శుక్రవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీడీవో పురుషోత్తం జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలకు ధరల తగ్గింపు గురించి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోహన్ మురళీ, సొసైటీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.