E.G: పోలవరం ప్రాజెక్టును రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి ఆదివారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ, కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు. కేంద్రం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిందని అవసరమైన నిధులను మంజూరు చేస్తుందన్నారు.