KDP: కమలాపురం మండలం గంగవరం సమీపంలోని ఏటూర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాజీపేట నుండి కమలాపురం వైపు వస్తున్న ఏపీ 39 ఎక్స్ 2967 నెంబర్ గల లారీ అరుగుపై కూర్చున్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదానికి గురైన వ్యక్తిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.