GNTR: తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అభినందించారు. 143 ఏళ్ల నాటి చారిత్రక తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని దాతల సహకారంతో ఇటీవల ఆధునీకరించి, దానికి ఐఎస్ఓ (ISO) గుర్తింపు తెచ్చినందుకు గాను సీఎం ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు.