సత్యసాయి: పెనుకొండ మండలం అడదాకులపల్లిలో శనివారం మంత్రి సవిత పర్యటించనున్నట్లు పెనుకొండ టీడీపీ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారని చెప్పారు. ఉ. 11 గంటలకు బొక్సంపల్లి గ్రామానికి వెళ్ళే రహదారిలో రూ.7 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ వంటి నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేస్తారని, నాయకులు పాల్గొనాలని కోరారు.