ASR: విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం హెచ్చరించారు. శనివారం అరకు బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలను సందర్శించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్య, ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.