సీఐ(CI) వీరంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా (Media) పైనా పోలీసులు దాడికి దిగారు. కొందర్నీ బూటుకాళ్లతో తన్ని తన కావరాన్ని ప్రదర్శించాడు సీఐ. పలువురిని అరెస్ట్ చేయడంతో.. వెంటనే కదిరి పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి టీడీపీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ నిరసన తెలిపారు.ఘటనలో గాయపడిన బాధితులను ప్రభుత్వ ఆస్పత్రిలో టీడీపీ నాయకులు పరిటాల సునీత, బి.కె.పార్థసారధి, నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. మహిళా కౌన్సిలర్ పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండా ఆక్రమణలు తొలగిస్తున్న వైనాన్ని కౌన్సిలర్( Councillor) సుధారాణి అడ్డుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న సీఐ (CI) మధు కౌన్సిలర్‌తో వాదనకు దిగారు. సభ్య సమాజం తలదించుకునేలా సీఐ మాటతీరు ఉండటం వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు