E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలో PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఉచిత సోలార్ విద్యుత్ అందించే ప్రక్రియను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గురువారం ప్రారంభించారు. రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 2,883 సోలార్ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.