GNTR: గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి ఎన్నికల్లో ఆదివారం కూటమి అభ్యర్థి వజ్జా రామకృష్ణ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1261 ఓట్లు పోల్ అవ్వగా, రామకృష్ణకు 849 ఓట్లు లభించాయి. ఆయనపై పోటీ చేసిన దొడ్డపనేని రాజేంద్రప్రసాద్‌కు 395 ఓట్లు రాగా, 17 ఓట్లు చెల్లలేదు. ఇదివరకు ఉపాధ్యక్షుడిగా దామా మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.