NDL: బనగానపల్లె మండలంలో ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించనున్నారు. భక్తుల సమర్పించిన నగదు కానుకలను దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారి సమక్షంలో లెక్కిస్తామని ఆలయ ఏవో పాండురంగారెడ్డి, ఛైర్మన్ మౌలిశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పారదర్శకంగా లెక్కింపు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.