E.G: పేదవాడి ఆరోగ్యానికి సంజీవనిలా సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 13 మంది లబ్ధిదారులకు రూ. 21,34,680 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.