సత్యసాయి: రొద్దం మండలం పెద్దగువ్వలపల్లి వద్ద అధిక ఎత్తులో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఎనిమిది స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో ప్రయాణం కష్టంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన ప్రమాణాలతో అవసరమైన చోట్ల మాత్రమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.