VZM: జాతీయ దత్తత అవగాహన మాస వేడుకల్లో భాగంగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్, నవజీవన్ చిల్డ్రన్ హోమ్‌లో అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో పిల్లలు ఎదుర్కొంటున్న దోపిడీ గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో బిహెచ్ లక్ష్మీ, పీవోఐసీ వై.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.