VZM: ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదివారం వేపాడ మండలం బల్లంకిలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 మంచినీటి బోర్లను ప్రారంభించారు. ప్రజలు మంచి నీటి ఎద్దడికి గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల TDP అధ్యక్షుడు గొంప వెంకట్రావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి తదితరులు పాల్గొన్నారు.