BPT: అద్దంకి మండలంలో ఈనెల 5వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వరూధిని శనివారం తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ పనులు, రైతులకు నూతన పాస్ పుస్తకాల పంపిణీ వంటి అంశాలపై చర్చించి తీర్మానాలు జరుగుతాయన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ఈ సమావేశాలు ప్రధాన ఉద్దేశమని ఎంపీడీవో వరూధిని తెలిపారు.