NLR: ఉదయగిరి మండల ప్రజా పరిషత్ (MPP) నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. రూ. 83.68 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం మండల అభివృద్ధికి, ప్రజలకు సేవలు వేగవంతంగా అందించడానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్స న్ ఆనం అరుణమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, పాల్గొన్నారు