AKP: వేసవి సెలవులను విద్యార్థులు ఉపయోగకరంగా వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. కుమార్ రాజు సూచించారు. మంగళవారం అచ్యుతాపురం శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పావురాల కథ ద్వారా నీతిని బోధించారు. విద్యార్థులు గ్రంథాలయాలను అలవాటు చేసుకోవాలన్నారు.