KRNL: పెద్దకడబూరు ZPH పాఠశాలను డిప్యూటీ డీఈవో వెంకటరమణ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి చదువులో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. అనంతరం PMSRI నిధులతో నిర్మిస్తున్న లైబ్రరీ, ల్యాబ్ గదులను HM ఉమారాజేశ్వరితో కలిసి పరిశీలించి నాణ్యత పాటించాలన్నారు.