GNTR: అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్‌లలో పర్యావరణహితంగా క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేయాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గురువారం ఇన్నర్ రింగ్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. నెలాఖరు నాటికి ప్రతి సచివాలయం పరిధిలో 50 ఇళ్లల్లో హోం కంపోస్ట్, 10 అపార్ట్మెంట్లలో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్లు ఉండాలని ఆదేశించారు.