NDL: శ్రీశైలం మహా పుణ్యక్షేత ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా 1,800 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల షారన్ తెలిపారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీస్ పాయింట్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. క్షేత్ర పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.