ప్రముఖ వ్యాపారవేత్త, చందనా బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహనరావు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సీఎంఆర్ సంస్థల అభివృద్ధికి కీలక పాత్ర పోషించిన మోహనరావు మృతి పట్ల వ్యాపారవేత్తలు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేశారు.