ప్రకాశం: జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు బుధవారం పీసీపల్లి వ్యవసాయ అధికారులతో కలిసి SI కోటయ్య పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువుల రికార్డు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం SI కోటయ్య మాట్లాడుతూ.. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.