VSP: మేనిఫెస్టో హామీల అమలుపై జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్ధమని వైసీపీకి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఎం.వి.పి. కాలనీలోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని వైసీపీపై విమర్శలు గుప్పించారు.