నెల్లూరు జిల్లా సర్వజన ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా గురువారం మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏవోకు ఆసుపత్రి పర్యవేక్షకులు సిద్ధనాయక్, అభివృద్ధి కమిటీ సభ్యులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.. ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి సౌకర్యాల కల్పనలో ముందు ఉంటామన్నారు.