ATP: రేపు కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుండగా 15వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ గౌతమి సోమశేఖర్ బుధవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో TDPలో చేరారు. అభివృద్ధి కోసం టీడీపీలోకి వచ్చానని ఆమె తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ కుల రాజకీయాలకు బుద్ధి చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.