VZM: ఉమ్మడి జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం 50→62, సాలూరు 29→32, నెల్లిమర్ల 20→23, పార్వతీపురం 30→36, బొబ్బిలి 31→36, పాలకొండ 20→28కి పెరిగాయి. రాజాం అంశం కోర్టులో ఉండటంతో వివరాలు ఇవ్వలేదు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల కానుంది.