ATP: శింగనమల మండలం నాయనపల్లికి చెందిన వెంకటరాముడుపై వైసీపీ నాయకులు దాడి చేయగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసుడు యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.