VSP: సిరిపురం వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హోం స్టే నిర్వహిస్తున్న రేణు గుప్తాతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. శనివారం సాయంత్రం ఆమె వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల సంతృప్తి, అభిప్రాయాలపై ఆరా తీశారు. వారితో మమేకం అవుతారా.. నగర విశేషాలను చెబుతారా అని అడిగి తెలుసుకున్నారు.