SRD: జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల విధుల నిర్వహణపై ప్రొసైడింగ్ అధికారులుగా నియమితులైన ఉపాధ్యాయులకు రేపటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా శిక్షణకు హాజరై, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.