BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి అమ్మను దర్శించుకునేందుకు పట్టణంలోని భవాని మాలదారులు పాదయాత్రగా ఇవాళ బయలుదేరారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పాదయాత్రగా వెళ్లి దర్శించుకోవడం తమకు సంతోషకరమని భవాని మాలదారులు తెలిపారు. తమతో పాటు అందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటారు.