HYD: పదేళ్లలో చేసిన అవినీతి, దుర్మార్గ పాలనను వ్యతిరేకించి 4 కోట్ల మంది బొందపెట్టినా BRS పార్టీకి ఇప్పటికీ బుద్ధి రాలేదని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. HYDలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. BRS పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని, ఇప్పటికే పార్టీ జాడ పత్తా లేదన్నారు.