మేడ్చల్: శామీర్ పేట బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అసలే పండుగ వేళ, ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు బస్టాండ్ వద్ద స్టాప్ చేయకపోవడంతో బస్సు ఎక్కడానికి వీలు లేకుండా పోతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని, ఒక్కోసారి నిలబడినా ప్రయోజనం ఉండటం లేదన్నారు.