SRD : దివ్యాంగుల జీవితాన్ని సులభతరం చేయడానికి త్రీ-చక్ర సైకిళ్లును ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఆదివారం అమీన్ పూర్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో త్రి-చక్ర సైకిళ్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.