అన్నమయ్య: రాజంపేట మున్సిపాలిటీలో గేట్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు శుక్రవారం హెచ్చరించారు. ఓ మహిళా చిరు వ్యాపారి వద్ద రూ. 40 వసూలు చేసిన ఘటనపై స్పందించి మార్కెట్‌ను సందర్శించారు. రూ. 2 వసూలు చేయాల్సిన చోట అధికంగా వసూలు చేస్తున్నారని చమర్తికి మండిపడ్డారు.