ATP: లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి, సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన దినసరి కూలీలను ఎమ్మెల్యే బండారు శ్రావణి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు.