కృష్ణా: సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్న అన్నదాత పోరు పోస్టర్ను గుడివాడ వైసీపీ కార్యాలయం వైసీపీ నేతలు ఆదివారం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని వైసీపీ నేతలు అన్నారు. విత్తనం మొదలు నుంచి అమ్మే వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇప్పుడు యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం క్యూలైన్లో ఉండి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.