ప్రకాశం: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నారాయణకు పదేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పు ప్రకటించారు. 2021లో మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదై విచారణ సాగింది. దోషిగా తేలిన నిందితుడిపై శిక్ష అమలు కానున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.