NLR: కోవూరు మండలం ఇనమడుగులోని రచ్చ బండ వద్ద సోమవారం రైతున్నా-మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. రైతులు నష్టపోకుండా సాగు పద్దతి ఉండాలని తమ ప్రభుత్వం యోచిస్తుందన్నారు. అందుకు తగిన అత్యాధునిక విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, రైతులకు సూచనలు, సలహాలను వ్యవసాయాధికారులు ఇస్తారని ఆమె తెలిపారు.