NDL: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర, సైబర్ సెక్యూరిటీ, హెల్మెట్ వాడకం వంటి అంశాలపై ఎస్సై మణికంఠ గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. హెల్మెట్ తలకు భారం కాదని, ప్రాణానికి భరోసా అని ఆయన పేర్కొన్నారు.