ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదివారం నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ. మూడు కోట్లకు పైగా నిధులతో ఈ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.