ప్రకాశం: ఒంగోలు కబాడీపాలెంకు చెందిన నళిని అనే యువతి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను ఆరా తీశారు. అయితే మృతురాలి వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ సూసైడ్ నోట్లో ఏముంది? ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.