BPT: అమెరికాలో మార్టూరు యువకుడు పాటిబండ్ల లోకేశ్ (23)మృతి చెందాడు. లోకేశ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి బోస్టన్ సిటీలో ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. M.S పూర్తయిన అనంతరం ఉద్యోగం సాధించి అక్కడే ఉంటున్న లోకేశ్ ఈతకు కొలనులో పడి ప్రమాదవశాత్తు గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. లోకేశ్ మృతదేహాన్ని మార్టూరుకు తీసుకురానున్నారు.