NLR: రాజధాని ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి రంగం సిద్ధం కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా దాన్ని అదిగమించి అమరావతిని రాజధానిగా సాధించామని తెలిపారు.