SKLM: ఆమదాలవలసలోని బీసీ బాలికల, ఎస్సీ బాలికల వసత గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడుతూ.. వసతి గృహంలో వారికి అందుతున్న పౌష్టికాహారం ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, వసతి గృహ పరిసరాలను తనిఖీ చేశారు.