SKLM: ఆమదాలవలస, పొందూరు మండలాలలో గల వివిధ గ్రామాలలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.10.92 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 71 పనులకు ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.