PLD: రేపు మాచర్ల మండల పరిధిలోని కొత్తపల్లిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త అల్లం కోటిరెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.