SKLM: రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు శనివారం తెలిపారు. ఉపవాస దీక్షల ద్వారా ఆత్మశుద్ధిని పొందుతూ, సహనము, క్రమశిక్షణ, దాతృత్వం వంటి విలువలను ఆచరిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవడం సమాజానికి ఆదర్శప్రాయమని మంత్రి తెలిపారు.